వెలసెనులే గగనాన | Velasenu Gaganana Lyrics , in Telugu And English, Telugu Christmas Song Lyrics, Naa Song

Velasenu Gaganana Song Lyrics in Telugu
వెలసెనులే గగనాన తూర్పుతార నిశీధిరేయి జాములో
కురిసెనులే జగాన ప్రేమధార రక్షకుడేసు జన్మలో
క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే ప్రభుయేసే జన్మించగా
కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే దీనులు ధన్యులాయెనే
శుభవార్త దూతదెల్పగ ఆ గొల్లలే గంతులేసేనే
లోకాన రక్షణానందమే పరలోకానా సంగీతమాయెనే
తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిను చూడగా
బంగారు సాంబ్రాణి బోళములర్పించి నమస్కరించి పూజించిరి
రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని
జగాలనేలే జయశీలుడేసే జీవాధిపతిగా జనియించెనే
శరీరధారై పరిశుద్ధుడేసే పశుశాలలోన పవళించెనే
జయగీతం పాడి కీర్తించి కొనియాడెదము
మా పాపభారం భరియించెనే మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే
మన్నించి మమ్ము క్షమియించెనే కరుణించి మాపై కృపచూపునే
మనసున్న మహారాజై మా మదిలో ఉదయించెనే
Velasenu Gaganana Song Lyrics in English
Velasenule Gaganaana Toorputaara Niseedhireyi Jaamulo
Kurisenule Jagaana Premadhaara Rakshakudesu Janmalo
Krismas Kaantule Lokaana Veligene Prabhuyese Janminchagaa
Kanyaku Puttenedu Parisuddhude Deenulu Dhanyulaayene
Subhavaarta Dootadelpaga Aa Gollale Gantulesene
Lokaana Rakshanaanandame Paralokaanaa Sangeetamaayene
Tarinchipoye Aa Toorpu Jnaanulu Teeraalu Daati Ninu Choodagaa
Bangaaru Saanbraani Bolamularpinchi Namaskarinchi Poojinchiri
Raaraaje Rakshakudai Manakosam Janminchenani
Jagaalanele Jayaseeludese Jeevaadhipatigaa Janiyinchene
Sareeradhaarai Parisuddhudese Pasusaalalona Pavalinchene
Jayageetam Paadi Keertinchi Koniyaadedamu
Maa Paapabhaaram Bhariyinchene Maa Du@Hkhkha Dosham Tolaginchene
Manninchi Mammu Kshamiyinchene Karuninchi Maapai Krupachoopune
Manasunna Mahaaraajai Maa Madilo Udayinchene