ఊహాకందని ప్రేమలోన | Oohaakandani Preamaloena Song Lyrics Telugu & English | John Wesly | ఊహాకందని ప్రేమలోన | Oohaakandani Preamaloena Song Lyrics |Hosanna Song | Telugu Christian Song | Naa Song

Oohaakandani Preamaloena Song Lyrics in Telugu
ఊహకందని ప్రేమలోన భావమే నీవు
హృదయమందు పరవసించుగానమే నీవు
మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు
మరపురాని కలల సౌధం గురుతులేనీవు
ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు "ఊహకందని ప్రేమ"
తల్లడి తల్లే తల్లి కన్నా మించిప్రేమించి
తనువు తీరే వరకు నన్ను విడువలేనంది
అదియేఆ ఆ ఆ నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా
నులివెచ్చనైన ఒడికి చేర్చిఆదరించిన ప్రేమయే
నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయే "ఊహకందని ప్రేమ"
నింగి నేలను కలిపిన బలమైన వారధిగా
నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా
అదియేఆ ఆ ఆ తన మహిమ విడిచిన త్యాగము ఈ భువికి వచ్చిన భాగ్యము
నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే
నీ సర్వమిచ్చిన దాతవు నను హత్తుకున్న స్వామివి "ఊహకందని ప్రేమ"
దేహమందు గాయమైతే కుదుట పడును కదా
గుండె గాయము గుర్తుపట్టిన నరుడు లేడుకదా
నీవే నీవే యేసయ్య నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు
ననుభుజముపైన మోసినఅలసిపోని ప్రేమవు
నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా "ఊహకందని ప్రేమ"
Oohaakandani Preamaloena Song Lyrics in English
Oohakandani Premalona Bhaavame Neevu
Hrudayamandu Paravasinchugaaname Neevu
Manasu Nindina Ramyamaina Gamyame Neevu
Marapuraani Kalala Saudham Gurutuleneevu
Edabaayalenannaanija Snehameneevu
Nee Prema Kaugililo Aanandame Neevu "Oohakandani Prema"
Talladi Talle Talli Kannaa Minchipreminchi
Tanuvu Teere Varaku Nannu Viduvalenandi
Adiyeaa Aa Aa Ne Gaayaparachina Velalo Kanneeru Kaarchina Premagaa
Nulivechchanaina Odiki Cherchiaadarinchina Premaye
Nee Gundelo Nanu Cherchina Nee Amaramaina Premaye "Oohakandani Prema"
Ningi Nelanu Kalipina Balamaina Vaaradhigaa
Nela Korigina Jeevitaanni Levanettenugaa
Adiyeaa Aa Aa Tana Mahima Vidichina Tyaagamu Ee Bhuviki Vachchina Bhaagyamu
Nanu Daatipoka Vedakina Nee Madhuramaina Premaye
Nee Sarvamichchina Daatavu Nanu Hattukunna Svaamivi "Oohakandani Prema"
Dehamandu Gaayamaite Kuduta Padunu Kadaa
Gunde Gaayamu Gurtupattina Narudu Ledukadaa
Neeve Neeve Yesayya Naa Antarangamu Tarachi Choosina Gaadhamaina Premavu
Nanubhujamupaina Mosinaalasiponi Premavu
Neevu Lenide Naa Bratukulo Viluvantoo Lene Ledayyaa "Oohakandani Prema"