2022 Hosanna Ministries Songs
Srikaruda Naa Yesayya Album 2022 Song
Amaramaina Prema Song Lyrics
Amaramaina Prema with Lyrics In Telugu
ప్రేమే శాశ్వతమైన
పరిశుద్ధమైన పొదరిల్లు
మనస్సే మందిరమాయె
నా మదిలో దీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని
ఉదయించు సూర్యునివలెనే
నిరంతరం నీ మాటతో
ప్రకాశింపచేయుదువు
అమరమైన నీ చరితం
విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన
పరివర్తనక్షేత్రము
ఇనాళ్ళుగ నను స్నేహించి
ఇంతగ ఫలింపజేసితివి
ఈ సర్వసంపదనంతటితో
అభినయించి నే పాడెదను
ఉండలేను బ్రతుకలేను
నీతోడు లేకుండా నీ నీడలేకుండా "ప్రేమే"
కమ్మనైన నీ ఉపదేశము
విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము
దైర్యమిచ్చెనా శ్రమలో
కరువుసీమలో సిరులోలికించెను
నీ వాక్యప్రవాహాము
గగనము చీల్చి మోపైన
దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీ కార్యములు
వివరింప నాతరమా వర్ణింప నా తరమా "ప్రేమే"
విధిరాసిన విషాదగీతం
సమసిపోయె నీ దయతో
సంబరమైన వాగ్ధానములతో
నాట్యముగా మార్చితివి
మమతల వంతెన దాటించి
మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జేష్ఠులతో
యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాడమైన ప్రేమ నీకు
మరువలేను యేసయ్యా "ప్రేమే"
Devuni Sankalpam with Lyrics In English
praemae SaaSvatamaina
pariSuddhamaina podarillu
manassae maMdiramaaye
naa madilO deepamu neevae
ninnaaSrayiMchina vaarini
udayiMchu sooryunivalenae
niraMtaraM nee maaTatO
prakaaSiMpachaeyuduvu
amaramaina nee charitaM
vimalamaina nee rudhiraM
aatmeeyamugaa uttaejaparachina
parivartanakshaetramu
inaaLLuga nanu snaehiMchi
iMtaga phaliMpajaesitivi
ee sarvasaMpadanaMtaTitO
abhinayiMchi nae paaDedanu
uMDalaenu bratukalaenu
neetODu laekuMDaa nee neeDalaekuMDaa "praemae"
kammanaina nee upadaeSamu
vijayamichche SOdhanalO
khaDgamukaMTae balamaina nee vaakyamu
dairyamichchenaa SramalO
karuvuseemalO sirulOlikiMchenu
nee vaakyapravaahaamu
gaganamu cheelchi mOpaina
deevena varshamu kuripiMchitivi
ghanamaina nee kaaryamulu
vivariMpa naataramaa varNiMpa naa taramaa "praemae"
vidhiraasina vishaadageetaM
samasipOye nee dayatO
saMbaramaina vaagdhaanamulatO
naaTyamugaa maarchitivi
mamatala vaMtena daaTiMchi
mahimalO sthaanamunichchitivi
nee raajyamulO jaeshThulatO
yugaayugamulu nae prakaaSiMchanaa
naa paina eMdukiMta gaaDamaina praema neeku
maruvalaenu yaesayyaa "praemae"