Ascharyamaina Prema Song Lyrics | ఆశ్చర్యమైన ప్రేమ | Jesus Song Telugu | Lent Day Song
Ascharyamaina Prema Song Lyrics In Telugu
ఆశ్చర్యమైన ప్రేమ..
కల్వరిలోని ప్రేమ..
మరణము కంటే బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ..
పరమును వీడిన ప్రేమ ధరలో
పాపిని వెతికిన ప్రేమ..
నన్ను కరుణించి ఆదరించి సేదతీర్చి
నిత్య జీవమిచ్చే.. "ఆశ్చర్యమైన"
పావన యేసుని ప్రేమ సిలువలో
పాపిని మోసినప్రేమ..
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి
తన మహిమనిచ్చే.. "ఆశ్చర్యమైన"
శ్రమలు సహించిన ప్రేమ నాకై
శాపము నోర్చిన ప్రేమ..
విడనాడని ప్రేమది
ఎన్నడూ యెడబాయదు.. "ఆశ్చర్యమైన"
నా స్థితి జూచిన ప్రేమ నాపై
జాలిని జూపిన ప్రేమ..
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి
కన్నీటిని తుడిచే.. "ఆశ్చర్యమైన"
Ascharyamaina Prema Song Lyrics In English
aaScharyamaina preama..
kalvariloeni preama..
maraNamu kamTea balamaina preamadi
nannu jayimche nee preama..
paramunu veeDina preama dharaloe
paapini vetikina preama..
nannu karuNimchi aadarimchi seadateerchi
nitya jeevamichchea.. "aaScharyamaina"
paavana yeasuni preama siluvaloe
paapini moesinapreama..
naakai maraNimchi jeevamichchi jayamichchi
tana mahimanichchea.. "aaScharyamaina"
Sramalu sahimchina preama naakai
Saapamu noerchina preama..
viDanaaDani preamadi
ennaDuu yeDabaayadu.. "aaScharyamaina"
naa sthiti juuchina preama naapai
jaalini juupina preama..
naakai parugetti kougalimchi muddaaDi
kanneeTini tuDichea.. "aaScharyamaina"