Top Telugu Church Songs List |
---|
☕ |
|
---|
Yedabayani Nee Krupa Song Lyrics | ఎడబాయని నీ కృపా | Telugu Jesus Lyrics
Yedabayani Nee Krupa Song Lyrics in Telugu
ఎడబాయని నీ కృపా
నను విడువదు ఎన్నటికీ
యేసయ్యా నీ ప్రేమాను రాగం
నను కాయును అనుక్షణం
శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో నిరాశ నిశ్పృహలో
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్ధమని నేననుకొనగ
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి "ఎడబాయని"
విశ్వాస పోరాటంలో
ఎదురాయె సోధనలు
లోకాశల అలజడిలో
సడలితి విశ్వాసముతో
దుష్టుల క్షేమమునేచూచి
ఇక నీతి వ్యర్దమని అనుకొనగ
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి "ఎడబాయని"
నీ సేవలో ఎదురైనా
ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని
నిరాశ చెందితిని
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగ
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి "ఎడబాయని"
Yedabayani Nee Krupa Song Lyrics in English
eDabaayani nee kRpaa
nanu viDuvadu ennaTikee
yaesayyaa nee praemaanu raagaM
nanu kaayunu anukshaNaM
SOkapu lOyalalO kashTaala kaDagaMDlalO
kaDalaeni kaDalilO niraaSa niSpRhalO
ardhamaekaani ee jeevitaM
ika vyardhamani naenanukonaga
kRpaa kanikaramugala daevaa
naa kashTaala kaDalini daaTiMchitivi "eDabaayani"
viSvaasa pOraaTaMlO
eduraaye sOdhanalu
lOkaaSala alajaDilO
saDaliti viSvaasamutO
dushTula kshaemamunaechoochi
ika neeti vyardamani anukonaga
deerghaSaaMtamugala daevaa
naa chaeyi viDuvaka naDipiMchitivi "eDabaayani"
nee saevalO edurainaa
ennO samasyalalO
naa balamunu choochukoni
niraaSa cheMditini
bhaaramaina ee saevanu
ika chaeyalaenani anukonaga
pradhaana yaajakuDaa yaesu
nee anubhavaalatO balaparichitivi "eDabaayani"
0 Comments