కరుణించవా దేవా Karuninchava Deva Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Karuninchava Deva Song Lyrics in Telugu
కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కావుమా శ్రమలోన తోడే లేక శిలనైన కానే కాక వేసారిపోయా యేసయ్య పిలిచాను నిన్నే దేవా కడదాక నాతో రావా నా జీవ దాత యేసయ్య
ఆశే నీవై నాలో నా జీవ గమనములోన దారే చూపే నాకు నీ వాక్య వెలుగులలోన నీలో నివాసమే నాలోని కోరిక నీ స్నేహ బంధమే సంతోష కానుక నీలో నిరీక్షణే నా మౌన గీతిక కాలాలు మారినా నీవుంటే చాలిక
ప్రేమే నాపై చూపి నా చేయి విడువని దేవా ధైర్యం నాలో నింపి నాతోటి నడచిన దేవా నీ సత్య మార్గమే నా జీవ బాటగా నీ నామ ధ్యానమే నాలోని శ్వాసగా నీలోనే ఏకమై నీ ప్రేమ సాక్షినై సాగాలి యేసయ్య నా జీవితాంతము
0 Comments