నీ కృపాతిశయము|Nee Krupatishayamu Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Nee Krupatishayamu Song Lyrics in Telugu
నీ కృపాతిశయమును అనునిత్యము
నే కీర్తించెద తరతరములకు
నీ విశ్వాస్యతను నే ప్రచురింతును
నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది
మౌనిగా ఎటులుండేద సాక్షిగా ప్రచురించక
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు
ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా
ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా
ఏ మంచితనము లేకున్నను
కొనసాగించినది నీ కృప నిలబెట్టుకున్నది నీ కృప "నీ కృపా"
పది తరములుగా వెంటాడిన మోయాబు శాపము
నీ కృపను శరణు వేడగా మార్చే నే వేయి తరములు
అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చినది
నీ కృపయే నను దీవించగా
ఏ శాపము నాపై పనిచేయదు "నీ కృపా"
ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా
మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా
కృపతోనే రక్షణ ఇచ్చావు నా క్రియల వలన కానే కాదు
జీవితమంతా రుణస్తుడను నీ యందే నిత్యము అతిశయము "నీ కృపా"
ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాధానమే
బలము ధనము ఉన్న అంటే నీదు కృపాధానమే
ఏ అర్హత నాలో లేకున్నను కృపా భిక్షయే నా యెడల
జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడెదను "నీ కృపా"
ప్రియులే నన్ను విడనాడిన శోకమే నా లోకమా
అనాధగానే మిగిలానే నా కథ ముగిసినదే
నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామి వంతుగా మారే
ఐదంతలాయే నా భాగ్యము విధిరాతనే మార్చే నీ కృప "నీ కృపా"
Nee Krupatishayamu Song RingTone - | Download |
---|
Nee Krupatishayamu Song Lyrics in English
nee kRpaatiSayamunu anunityamu
nae keertiMcheda tarataramulaku
nee viSvaasyatanu nae prachuriMtunu
nee kRpaa nee kRpaa aakaaSamu kaMTae hechchainadi
maunigaa eTuluMDaeda saakshigaa prachuriMchaka
naa tudi Svaasa varaku nee cheMta chaerae varaku
iMkaa bratiki unnaamaMTae kaevalamu nee kRpaa
iMkaa saevalO unnaamaMTae kaevalamu nee kRpaa
ae maMchitanamu laekunnanu
konasaagiMchinadi nee kRpa nilabeTTukunnadi nee kRpa "nee kRpaa"
padi taramulugaa veMTaaDina mOyaabu Saapamu
nee kRpanu SaraNu vaeDagaa maarchae nae vaeyi taramulu
anyuraalaina aa rootunu dhanyuraalugaa maarchinadi
nee kRpayae nanu deeviMchagaa
ae Saapamu naapai panichaeyadu "nee kRpaa"
aarOgyaM udyOgaM unnaayaMTae kaevalamu nee kRpaa
metuku bratuku unnaayaMTae kaevalamu nee kRpaa
kRpatOnae rakshaNa ichchaavu naa kriyala valana kaanae kaadu
jeevitamaMtaa ruNastuDanu nee yaMdae nityamu atiSayamu "nee kRpaa"
illu vaahanamunnaayaMTae needu kRpaadhaanamae
balamu dhanamu unna aMTae needu kRpaadhaanamae
ae arhata naalO laekunnanu kRpaa bhikshayae naa yeDala
jeevitamaMtaa kRtaj~nuDanu jeevitamaMtaa paaDedanu "nee kRpaa"
priyulae nannu viDanaaDina SOkamae naa lOkamaa
anaadhagaanae migilaanae naa katha mugisinadae
nee kuDi chaetilO uMchaganae benyaami vaMtugaa maarae
aidaMtalaayae naa bhaagyamu vidhiraatanae maarchae nee kRpa "nee kRpaa"