నీ సిలువ శ్రమలు |NEE SILUVA SRAMALU Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

NEE SILUVA SRAMALU Song Lyrics in Telugu
నీ సిలువ శ్రమలు ధ్యానించాలని
నీ సముఖములో తరించాలని
మాలిన్యమునకు దూరంగా నీకిష్టమైన యాగంగా
జీవితం మలచుకోవాలనే పవిత్ర సాధన దీక్ష
ఇది సిలువ దీక్ష స్వపరీక్ష
మానవపాపపరిహారార్థం భువికేతెంచిన నీవు
సిలువను మోసి మరణమునొంది నీపని ముగించినావు
నా సిలువను నేనెత్తుకొని నన్ను నేను తగ్గించుకొని
నీ అడుగులలో నడవాలనే పవిత్ర సాధన దీక్ష
లోక పాపాలగూర్చిన బాధతో రక్తమాయె నీ స్వేదం
గెత్సెమనెలో మోకాళ్ళపైన మ్రోగెను ప్రార్థననాదం
నా పాపక్రియలకొరకై నే పశ్చాత్తాప హృదయముతో
ఆత్మీయ వసంతం పొందాలనే పవిత్ర సాధన దీక్ష
పరోపకారమే ఆహారంగా ఇలలో జీవించినావు
ప్రేమ కలిగియుండుమని బోధించి మాదిరి చూపించినావు
శత్రువుకై ప్రార్ధించిన అందరికి మేలు చేసిన
నీ మనసు కలిగియుండాలనే పవిత్ర సాధన దీక్ష
>
Parama jeevamu naaku nivva Song RingTone - | Download |
---|
NEE SILUVA SRAMALU Song Lyrics in English
Nee Siluva Sramalu Dhyaaninchaalani
Nee Samukhamulo Tarinchaalani
Maalinyamunaku Doorangaa Neekishtamaina Yaagangaa
Jeevitam Malachukovaalane Pavitra Saadhana Deeksha
Idi Siluva Deeksha Svapareeksha
Maanavapaapaparihaaraartham Bhuviketenchina Neevu
Siluvanu Mosi Maranamunondi Neepani Muginchinaavu
Naa Siluvanu Nenettukoni Nannu Nenu Tagginchukoni
Nee Adugulalo Nadavaalane Pavitra Saadhana Deeksha
Loka Paapaalagoorchina Baadhato Raktamaaye Nee Svedam
Getsemanelo Mokaallapaina Mrogenu Praarthananaadam
Naa Paapakriyalakorakai Ne Paschaattaapa Hrudayamuto
Aatmeeya Vasantam Pondaalane Pavitra Saadhana Deeksha
Paropakaarame Aahaarangaa Ilalo Jeevinchinaavu
Prema Kaligiyundumani Bodhinchi Maadiri Choopinchinaavu
Satruvukai Praardhinchina Andariki Melu Chesina
Nee Manasu Kaligiyundaalane Pavitra Saadhana Deeksha